కోరుట్ల

కోరుట్ల మినీ స్టేడియంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు

viswatelangana.com

September 25th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

సెప్టెంబర్ 29 న కోరుట్ల మినీ స్టేడియంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలను నిర్వహిస్తున్నామని, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్య రెడ్డి. సి హెచ్. శంకర్ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో 14 సంవత్సరాలనుండి 20 సంవత్సరాల లోపు బాల, బాలికలకు రన్నింగ్ పోటీలు వంద మీటర్లు, 2వందల మీటర్లు, వెయ్యి మీటర్లు, 60 మీటర్ లు, 6 వందల మీటర్ ల రన్నింగ్ పోటీలు అలాగే షాట్ పుట్ మరియు జావలిన్ త్రో 3 వేల మీటర్ లు, వాకింగ్ రేస్ 5 వేల మీటర్ లు, తదితర పోటీలు ఉండును, ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులను వచ్చేనెల హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసి పంపించబడునని, ఏలేటి ముత్తయ్య రెడ్డి అలాగే జిల్లా సంఘ సభ్యులు సి హెచ్. శంకర్ తెలిపారు. ముందుగా ఆన్లైన్ ఎంట్రీలు వాట్సాప్ ద్వారా సెప్టెంబర్ 28 శనివారం రోజు సాయంత్రం వరకు జిల్లాలోని అన్ని పాఠశాల నుండి వారి యొక్క పాఠశాల లెటర్ ప్యాడ్ మీద పంపించలని కోరారు.

Related Articles

Back to top button