మెట్ పల్లి
మెట్ పల్లిలో వెల్లివిరిసిన మతసామరస్యం

viswatelangana.com
April 21st, 2024
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్ పల్లి లో మండుటెండలను సైతం లెక్కచేయకుండా కాలినడకన ప్రధాన రహదారి గుండా కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్తున్న అంజన్న స్వాములకు మెట్ పల్లి పట్టణానికి చెందిన జమతుల్ ఉల్మా డిస్టిక్ జనరల్ సెక్రటరీ ముక్తి మెహల్ శ్యామ్జి, జాహిద్ ముల్షాప్, ఎండి రైస్, ఎండి అజారుద్దీన్ తదితరులు శీతల పానీయలు అందించడం జరిగింది. ఈ విధంగా ముస్లిం సోదరులు అంజన్న స్వాములకు శీతల పానీయాలు వితరణ చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.



