కథలాపూర్
అక్రమ ఇసుక రవాణా పై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కు వినతి

viswatelangana.com
October 21st, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తక్కలపల్లి గ్రామంలో గీత కార్మికులు 8 ఎకరాల (సర్వే నం. 1185-1187) ఈతవనం వాగు పక్కన వేయడం జరిగింది. వర్షా కాలంలో వర్షాలు కురవడంతో ఇసుక వీరి పొలంలో పక్క పొలాలలో ఏర్పడడంతో ఇసుక వ్యాపారులు రాత్రిపూట పెద్ద ఎత్తున ఇసుకను తరలించడంతో పక్కనే ఉన్న ఈతవనం దెబ్బతిన్నదని వారు తీసిన ఇసుక వల్ల కాలువలా ఏర్పడి ఈతవనం కోతకు గురి అవుతున్నాయని ఇదివరకు రెండు ఎకరాలు కోతకు గురైందని కలెక్టర్ కు విన్నవించుకున్న ప్రయోజనం లేకపోయిందని గత తహసీల్దార్ కు ఇచ్చాము ఇప్పుడు మీకు కూడా ఇస్తున్నాము దీనిపై చర్య తీసుకోమని తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ఇందుకు గాను తహసీల్దార్ సానుకూలంగా స్పందిస్తూ ఎంక్వయిరీ చేస్తామని ఎవరికి అలాంటి ఇసుక కొరకు పర్మిషన్ ఇవ్వలేదని తెలిపారు.



