కొడిమ్యాల
అయ్యప్ప స్వామి ఆలయంలో మహా పడిపూజ

viswatelangana.com
April 14th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి శరణమ య్యప్ప,విషు పూజ కార్యక్రమం అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉదయం ఎనిమిది గంటలకు మహా పడిపూజ కార్యక్రమంలో ముందుగా గణపతి పూజ నవగ్రహ పూజ, సుబ్రహ్మణ్య స్వామి పూజ, అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహం కు పంచామృత అభిషేకం, తదుపరి18 మెట్ల పడిపూజ కార్యక్రమం అర్చకులు సంతోష్ పవన్ శర్మ నిర్వహించారు. మధ్యాహ్నం మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భక్తులు, దాతలు, హనుమాన్ దీక్ష స్వాములు, మాత స్వాములు, యువకులు, విద్యార్థులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈకార్యక్రమానికి వస్తు రూపేనా, ధన రూపేనా, శ్రమ రూపేనా, సహకరించిన, వారికి ఆ అయ్యప్ప స్వామి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు.



