కోరుట్ల
ఇంగ్లీష్ టీచర్ దండే గంగాధర్ ..పదవీ విరమణ సన్మానం

viswatelangana.com
April 24th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల లోని కాల్వగడ్డ జడ్పీ బాయ్స్ హై స్కూల్ ఇంగ్లీష్ టీచర్ దండే గంగాధర్ (స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ) మంగళవారం పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు భూమయ్య తో పాటు ఉపాధ్యాయులు, స్టూడెంట్స్ తల్లిదండ్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, విద్యార్థులు, అమ్మ ఆదర్శ పాఠశాల వారు ఇంగ్లీష్ టీచర్ గంగాధర్ ను ఘనంగా సన్మానించారు. స్కూల్ లో గంగాధర్ అందించిన ఉత్తమ సేవలను కొనియాడారు.విధి నిర్వహణ లో అకింత భావంతో పనిచేసిన ఇంగ్లీషు టీచర్ గంగాధర్ సేవలను మర్చిపోలేనివని అభిప్రాయం వ్యక్తం చేశారు.



