కోరుట్ల
అమ్మవారి పూజలో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు

viswatelangana.com
October 7th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల మండలం చిన్న మెట్పల్లి గ్రామంలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు గ్రామంలోని దుర్గాదేవి మండపంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు పన్నాల అంజిరెడ్డి, చిన్న మెట్పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్మూర్ గంగాధర్, గ్రామ దుర్గ మాత సేవా సమితి అధ్యక్షులు కొట్టాల మహిపాల్ రెడ్డి, అశోక్ రెడ్డి, సంధిరెడ్డి తిరుపతిరెడ్డి, ఆసం విజయ్ కుమార్, నాగులపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.



