అవినీతిని ఆర్టీఐతో కొట్టండి

viswatelangana.com
ప్రశ్నించడమే సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ )ప్రజలకు ఇచ్చిన దివ్యాయుధం. ఏదైనా సమాచారం కావాలంటే అధికారులకు లంచాలు ఇవ్వద్దు. ఆర్టిఐని ఉపయోగించుకోవాలని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ డిస్ట్రిక్ జాయింట్ సెక్రటరీ తాలూకా మల్లేష్ అన్నారు. ఆయన మాట్లాడుతూ కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ ( పౌర మరియు మానవ హక్కుల సంస్థ ) సమాజంలో పేరుకుపోయిన అవినీతిని బయటకు తీస్తామని, అవినీతి రహిత అలసత్వం లేని సమాజం నిర్మించడమే సిసిఆర్ యొక్క ప్రధాన ఉద్దేశమని, అలాగే త్వరలో జరగబోయే అవినీతి నిరోధక వారోత్సవాల ( ఇంటర్నేషనల్ ఆంటి కరప్షన్ డే) సందర్భంగా సి సి ఆర్ ఆధ్వర్యంలో అవినీతి నిరోధక వారోత్సవాలు నిర్వహిస్తామని, అందులో భాగంగా అవినీతి నిరోధక శాఖ కార్యాలయాలలో మరియు ప్రతి జిల్లా కలెక్టర్లను కలిసి వినతి పత్రాలను అందజేస్తామని అలాగే ప్రతి ప్రభుత్వ కార్యాలయం వద్ద అవినీతి నిరోధక శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు ప్రజలకు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తాలూకా మల్లేష్ కోరారు అవినీతికి తావు లేకుండా ప్రజలకు నిస్వార్ధంగా సేవలు పొందేలా చూడాలని, అలాగే అవినీతి చేస్తూ పట్టుబడిన అధికారులను కఠినంగా శిక్షించి వారిని పూర్తిగా ఉద్యోగం నుండి తొలగించి పింఛన్ రాకుండా చట్టాలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతిపత్రాన్ని సమర్పించబోతున్నట్లు తెలిపారు. ప్రజలందరూ సమాచార హక్కు చట్టం పై అవగాహన పెంచుకోవాలని ఆయన వివరించారు.



