కోరుట్ల

జమిలి ఎన్నికల విధానానికి సిపిఐ వ్యతిరేకం

సిపిఐ జాతీయ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

viswatelangana.com

March 22nd, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జమిలి ఎన్నికలు నిర్వహణ కేంద్ర ప్రభుత్వ విధానానికి సిపిఐ వ్యతిరేకమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట రెడ్డి అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జగిత్యాల జిల్లా కమిటీ సమావేశం కోరుట్ల డివిజన్ లోని శ్రీ ప్రభాకర్ భవన్ లో శనివారం రోజున జరిగింది. ప్రస్తుత జనాభా ప్రతిపాదికన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగినట్లయితే దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గి ఉత్తరాది రాష్ట్రాల అజమాసి పెరిగి నష్టపోతారన్నారు. దేశంలో నక్స నిజాన్ని, కమ్యూనిస్టులను రూపుమాపే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దేశంలో ఆర్ఎస్ఎస్, బిజెపి చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తున్న అభ్యుదయ వాదులను కమ్యూనిస్టులను అన్చివేసే విధానాలు సరికావన్నారు. రాష్ట్ర బడ్జెట్ విషయానికొస్తే 7 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ ప్రభుత్వం 3 లక్షల కోట్లపై చిలుకు బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో పాటు సంక్షేమ పథకాలకు కొంతమెరైన కేటాయింపులు జరగడం శుభ సూచకం అన్నారు. అంకెల గారిడికి పరిమితం కాకుండా ఆయా పథకాలకు సంబంధించిన కేటాయింపులు సక్రమంగా అమలు జరిగితే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. పేద ప్రజలను కిందిస్థాయి ఉద్యోగులైన మున్సిపల్ గ్రామపంచాయతీ అంగన్వాడి మధ్యాహ్న భోజన పథకం లాంటి పేద ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పని చేయాలని విజ్ఞప్తి చేశారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ చట్టభద్రత కల్పించడాన్ని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తింపునకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందడం పట్ల హర్ష వ్యక్తం చేశారు. ఏప్రిల్ మే నెలలో గ్రామ, మండల సిపిఐ మహాసభలు పూర్తి చేసుకొని జిల్లా మహాసభలు జూన్ 5న జగిత్యాల జిల్లా కేంద్రంలో తరుపున తీర్మానించారు. ఈనెల 23న భగత్ సింగ్ వర్ధంతిని అన్నిచోట్ల ఘనంగా నిర్వహించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా నేతలు వెన్న సురేష్, సిపిఐ రాష్ట్ర మాజీ కమిటీ సభ్యులు చిన్న విశ్వనాథం, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సుతారి రాములు, కార్యదర్శి ఎండి ముక్రం, బీడీ కార్మిక సంఘం నేతలు కొక్కుల శాంత, ఎన్నం రాధా, మునుగోరు హనుమంతు, మహమ్మద్ మౌలానా, ఎండి ఉస్మాన్, అక్రమ్ పాష, ఎండి ఉస్మాన్, వెన్న మహేష్, ఇరు గుర్రాల భూమేశ్వర్, సాంబార్ మహేష్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button