సన్నం బియ్యం పంపిణీపై కాంగ్రెస్ జిల్లా మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ వసీఉర్ రహ్మాన్ వ్యాఖ్యలు

viswatelangana.com
కోరుట్ల పట్టణంలో కాంగ్రెస్ జిల్లా మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ వసీ ఉర్ రహ్మాన్ మాట్లాడుతూ… ఈ నెల నుంచి ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చరిత్రలో లిఖించ దగ్గ పరిణామం పేద ప్రజలకు ఉచితంగా సన్న బియ్యం శ్రీమంతులే కాదు పేద ప్రజలు సన్న బియ్యం తినాలి ప్రతి పేదవాని కడుపునిండాలి ప్రతి రోజు పండుగ కావాలి అనేది ప్రజా ప్రభుత్వ ఆలోచన సోనియమ్మ అమ్మ పాత్ర పోషించి పేదల కోసం ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చింది స్వతంత్ర భారతదేశ చరిత్రలో రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ చేసిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి దక్కుతుంది ఈ పథకం నిరుపేదలకు ఒక వరం సన్న బియ్యం పంపిణీతో పేదలకు అసలైన పండుగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ఈ చర్య పేదల ఆహార భద్రతకు ఎంతో దోహదపడుతుందని ఆయన అన్నారు. ప్రజలు అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని వసీఉర్ రహ్మాన్ ప్రజలను విజ్ఞప్తి చేశారు.



