విద్యార్థులు ఉన్నత చదువులతో ముందుకు సాగాలి

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మూటపెల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు మాజీ సర్పంచ్ మండ రమేష్ ఎగ్జామ్ ప్యాడ్స్, కంపాస్ బాక్స్,ఇతర ఎగ్జామినేషన్ మెటీరియల్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఫైనల్ ఎగ్జామ్స్ లో మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. తాజా మాజీ సర్పంచ్ బెక్కం తిరుపతి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ఉన్నత చదువులు చదివి,మంచి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని,మిగిలిన విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని,ఈ పోటీ ప్రపంచంలో కష్టపడి విభిన్న రంగాలలో రాణించాలని, తమదైన ముద్ర వేయాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ వనిత మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, మంచి పౌరులుగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొల్లి శ్రీనివాస్, ఉపాధ్యాయులు ముక్కెర శేఖర్, చందు సుజాత,రాజ్ కిరణ్, జాన్, రాజు,అంజు బేగం, ప్రియాంక పాల్గొన్నారు.



