రైతుల విషయంలో బీఆర్ఎస్ విమర్శ సరి కాదు – నిజామాబాద్ కాంగ్రెస్ సేవాదళ్ ఇంచార్జ్ శ్రీ గద్దె నరహరి

viswatelangana.com
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో నిజామాబాద్ కాంగ్రెస్ సేవాదళ్ ఇంచార్జి శ్రీగద్దె నరహరి మాట్లాడుతూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పదేళ్ల పాలనలో ధాన్యం తడిస్తే కొనే దిక్కులేదని, అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే పైసా సాయం లేదని, పంటల బీమా పథకం లేదని, వరి కుప్పలపై రైతులు గుండెలు పగిలి చచ్చినా పట్టించుకున్న నాథుడు లేడని, ఖమ్మంలో మిర్చికి ధర అడిగినందుకు గిరిజన రైతులకు బేడీలు వేశారని, వరంగల్ లో పత్తి రైతుల ఆత్మహత్యల గోస విన్నది లేదని, ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 8 వేల పై చిలుకు రైతులు మరణిస్తే ప్రభుత్వంలో చలనం లేదని, రైతులకు ఎరువులు ఫ్రీ అని మోసం చేసి మొండి చేయి చూపితే తప్పు లేదని, 2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో రూ.1 లక్ష రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి 2023 ఆగస్టు వరకు దాని ఊసే ఎత్తలేదని, ఎన్నికలు వస్తున్నాయని మొదలు పెట్టిన రుణమాఫీ రైతుకు చేరనే లేదని, రైతులకు సంబంధించిన అన్ని సబ్సిడీలు బంద్ చేస్తే తప్పు లేదని, వరి వేస్తే ఉరేనని రైతులను బెదిరిస్తే అన్యాయం అన్నోడు లేడని, కాంట కాడ దళారుల చేతివాటంతో క్వింటాల్ కు 10 కేజీలు తరుగు పేరుతో దోచేసినా ఏ నాడు కేసీఆర్ పట్టించుకోలేదని, సివిల్ సప్లై కార్పోరేషన్ లో రూ.56 వేల కోట్ల అప్పుల పాలు చేసిన బీఆర్ఎస్ సర్కారు. ఇన్ని పాపాలు చేసి. రైతుల పాలిట శాపాలుగా మారి బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా విశ్వాసం కోల్పోయిందని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలనలోనే రైతు భరోసా రూ.7,500 కోట్లు వేసి ఆగస్టు 15 లోపు రైతుకు రూ.2 లక్షల రుణమాఫీకి కార్యచరణ ప్రకటించి, వచ్చే పంట నుండి క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్న, అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇచ్చి, పంటల భీమకు శ్రీకారం చుట్టి ప్రతి పంటకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమైన ప్రభుత్వాన్ని విమర్శించడం తగదని అన్నారు. రైతులకు రుణమాఫీ కి కార్పొరేషన్ పట్ల హర్షం వ్యక్తం చేశారు.



