ప్రతి స్కూల్ బస్సులు అన్ని రకాల ధ్రువపత్రాలు కలిగి ఉండాలి

viswatelangana.com
- కోరుట్ల మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్
జగిత్యాల జిల్లా కోరుట్ల యూనిట్ ఆఫీస్ పరిధిలో గల కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండల మరియు గ్రామాల వాహన యజమానులకు సకాలంలో వాహన పత్రాలు చేసుకోవాలని కోరుట్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సూచించారు. కోరుట్ల మరియు మెట్ పల్లి ప్రాంతాలలో స్కూల్ బస్సుల తనిఖీలు శనివారం రోజున నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి రవాణా వాహన వాహనాలను ఫిట్నెస్, పర్మిట్, రిజిస్ట్రేషన్, పొల్యూషన్, టాక్స్ మరియు వాహన డ్రైవర్ కు తగిన అర్హతలు గల లైసెన్సు కలిగి ఉండాలని కోరారు. ముఖ్యంగా స్కూల్ యాజమాన్యాలు స్కూల్ బస్సుల పట్ల స్కూల్ యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవాలని, బస్సుల యొక్క ఫిట్నెస్, ఇన్సూరెన్స్ బస్సుకు సంబంధిత ధ్రువపత్రాలు సకాలంలో కలిగి ఉండాలని లేకుంటే స్కూల్ బస్సుల పట్ల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కోరుట్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ స్కూల్ యాజమాన్యాలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ గిరీష్, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు



