భాషా పండితుల కు పదోన్నతులు కల్పించి సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించాలి
viswatelangana.com
- అభినందన సభ లో జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్
- ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. టిపిసిసి అధికార ప్రతినిధి మ్యానిఫెస్టో కమిటి సభ్యులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి.
భాషా పండితుల ఆత్మీయ సమ్మేళనం నూతన ప్రభుత్వానికి అభినందన సభ కార్యక్రమాన్ని భాషా పండితుల పక్షాన హైదరాబాద్ గాంధీభవన్ ప్రకాశం హాలు లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ ప్రత్యేక ఆహ్వానితులు టిపిసిసి అధికార ప్రతినిధి, మ్యానిఫెస్టో కమిటి సభ్యులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డికి సభ అధ్యక్షులు యం.డి. అబ్దుల్లా కు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు జగిత్యాల జిల్లా శాఖ పక్షాన జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్ పుష్పగుచ్చం అందజేసి ఘన సన్మానం చేసారు. ఈ సందర్భంగా స్వామి యాదవ్ మాట్లాడుతూ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయించాలని, సుమారుగా గత ముప్పై సంవత్సరాలుగా భాషా పండితులు సమాన పనికి సమాన వేతనం సమాన గౌరవం లభించక వెట్టిచాకిరి శ్రమదోపిడికి గురౌతూ ఆత్మగౌరవం చంపుకొని పని చేస్తున్నారని భాషా పండితుల కు పదోన్నతులు కల్పించి న్యాయం చేయాలని, ఈ ప్రజా ప్రభుత్వం తో గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి కృషి, చొరవతో భాషాపండితుల సమస్యలు పరిష్కారమౌతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి భాషా పండితుల పదోన్నతులు, టెట్ మినహాయింపులు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఆర్.యు.పి.పి.టి. జగిత్యాల జిల్లా శాఖ పక్షాన హర్షవర్ధన్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి కృష్ణ, సభానిర్వహకులు ఆదిలాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు వివేక్ భవానీ, మెడ్చల్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మన్, కనకయ్య, విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.



