కోరుట్ల

జోగన్ పల్లి లో తెలంగాణ ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్

viswatelangana.com

February 7th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలంలోని జోగన్ పల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ కార్యక్రమాన్ని బుధవారం రోజున ప్రారంభించారు. గ్రామ పంచాయతీ నుండి ర్యాలీగా గ్రామంలో తిరిగి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 7వ నుండి 15వ వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, అంగన్‌వాడీ, ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా అవగాహన కల్పిస్తారనీ, శిథిలాస్థకు చేరిన ప్రభుత్వ భవనాల తొలగింపు, ఉపయోగపడని బావులను పూడ్చివేయడం, రోడ్లు, ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను శుభ్రపరచడం, ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన కల్పించడం వంటి పనులు చేపడుతారు. మురుగు కాలువల్లో వ్యర్థపు నీరు నిల్వ ఉండకుండా పూడిక తీయడం, వీధుల్లో గుంతలను పూడ్చడం, దోమలు వృద్ధి చెందకుండా రసాయనం పిచికారీ చేయడం వంటివి స్పెషల్‌ డ్రైవ్‌లో చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హకీమ్, కరోబార్ అంజయ్య, డాక్టర్ ప్రతిష్ట, అంగన్వాడీ టీచర్స్ కృష్ణవేణి, లక్ష్మి,వనజ, ఆశ వర్కర్ శ్వేత, కోరుట్ల నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు సహదేవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సైధు గంగాధర్, ఇంద్రాల హరీష్, ఇంద్రాల అశోక్, కొమ్ము శంకర్, పంచాయతీ సిబ్బంది శ్రీధర్, గంగారెడ్డి తదిదరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button