రాయికల్

కళాశాల విద్యార్థులకు బస్సులు అందుబాటులో ఉంచాలి

viswatelangana.com

July 1st, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు కళాశాల సమయంలో ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచాలని రాయికల్ పట్టణ నాలుగో వార్డ్ కౌన్సిలర్ తురగ శ్రీధర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ఆలూరు వీరాపూర్ ధర్మాజి పెట్, తాట్లావాయి, ధావన్ పెళ్లి వడ్డేలింగపూర్ కొత్తపేట మూట పెళ్లి ఇటిక్యాల మీదుగా బస్సు రింగ్ రూట్ మ్యాప్ ఏర్పాటుచేసి అట్టి రోడ్డు మీదుగా కాలేజీ సమయంలో విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం 9:30 నుండి సాయంత్రం 4:30 నిమిషాల వరకు ఆర్టీసీ బస్సులను నడపాలని ఆయన జిల్లా కలెక్టర్ ను కోరారు బస్సు సౌకర్యం లేనందున సకాలంలో విద్యార్థులు కళాశాల కార్యకలేక పోతున్నారని రవాణా సౌకర్యం లేక చదువు మానేసే పరిస్థితులు వస్తున్నాయని ప్రభుత్వ జూనియర్ కళాశాల నిరుపేద విద్యార్థులకు రవాణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు

Related Articles

Back to top button