లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విస్డం స్కూల్ విద్యార్థులకు సన్మానం
viswatelangana.com
లయన్స్ క్లబ్ రాయికల్ ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం రోజున మెట్పల్లి లో జరిగిన రీజియన్ మీట్ కార్యక్రమంలో బ్యానర్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో మొదటి బహుమతి పొందడం జరిగింది అందులో ముఖ్యంగా శ్రీరామ లక్ష్మణ జానకి సమేత హనుమంతుడు వేషధారణలతో పాటు ప్రవచనాలు రామాయణ గానం పై లవకుశుల అభినయం ప్రధాన పాత్ర పోషించాయి అందుకుగాను పౌరాణిక పాత్రలు పోషించి ప్రధమ బహుమతి రావడానికి కారణమైన పట్టణంలోని విస్డం హై స్కూల్ విద్యార్థులకు ఘనంగా సన్మానం చేశారు అలానే అన్ని రంగాలలో విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారి సర్వాంగీన వికాసానికి కృషి చేస్తూ నిన్న జరిగిన ట్రస్మా జగిత్యాల జిల్లా ఎన్నికల్లో జిల్లా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన పాఠశాల కరస్పాండెంట్ ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి ని అభినందిస్తూ వారికి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొమ్ముల ఆది రెడ్డి కార్యదర్శి మొసరపు శ్రీకాంత్ కోశాధికారి గంట్యాల ప్రవీణ్ జడ్సీ కాటిపల్లి రాంరెడ్డి డిసి మ్యాకల రమేష్ కడకుంట్ల నరేష్ బొమ్మ కంటి నవీన్ తదితరులు పాల్గొన్నారు.



