మేడిపల్లి
ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ

viswatelangana.com
May 9th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
భీమారం మండలంలోని మన్నెగూడెం గ్రామంలో గురువారం రోజున సుమారుగా 290 మంది ఉపాధి హామీ కూలీలకు శ్రీ తేలు రాజేందర్ తనవంతుగా వారికి మజ్జిగ పాకెట్లు అందజేయడం జరిగింది, రాజేందర్ కు ఉపాధి హామీ కూలీలు కృతజ్ఞతలు తెలిపారు. సమాజ సేవలో ముందుండే తేలు రాజేందర్ ను గ్రామ ప్రజలు అభినందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కొత్తపెళ్లి మహేష్, మగ్గిడి తిరుపతి, బండి ప్రదీప్, తొట్ల రాజు, ఉమ్మడి బక్కన్న, కంచి అశోక్ తదితరులు పాల్గొన్నారు.



