కథలాపూర్
భూషణరావుపేటలో 10 తులాల బంగారం చోరీ

viswatelangana.com
January 14th, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామంలో ఓ ఇంటిలో 10 తులాల బంగారం ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితురాలు అంగరి రేణుక పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. బంగారు ఆభరణాలను తన ఇంట్లోని స్టీల్ డబ్బాలో పెట్టుకోగా మాయమైనట్లు బాధితురాలు అంగరి రేణుక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కథలాపూర్ ఎస్ఐ నవీన్ కుమార్ పరిశీలించి బాధిత కుటుంబాన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు.



