కోరుట్ల

ఎంపీ నిధుల నుండి 50 లక్షలు మంజూరు

viswatelangana.com

February 23rd, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కుల సంఘాల భవనాల కోసం ఎంపీ నిధుల నుండి కోరుట్ల నియోజకవర్గానికి సుమారుగా 50 లక్షల రూపాయలు మంజూరు చేసిన నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ ఈ సందర్భంగా కోరుట్ల బిజెపి నియోజకవర్గ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్ ఎంపీ అరవింద్ మంజూరు చేసిన ప్రోసిడింగ్ పేపర్ ను స్థానిక బిజెపి కార్యాలయంలో విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గంలో కుల సంఘాల సంక్షేమం కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ తన నిధుల నుండి మంజూరు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నామని కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని దేశంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ కేవలం బిజెపితోనే సాధ్యమని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని దేశ ప్రజలు ఔర్ ఏక్ బార్ దేశ ప్రధాని నరేంద్ర మోడీని గెలిపించుకోబోతున్నారని చెప్పారు ఈ యొక్క సమావేశంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధోనీకేల నవీన్, పట్టణ మరియు మండలాల అధ్యక్షులు బింగి వెంకటేష్ , బాయ్ లింగారెడ్డి . గోపిడి శ్రీనివాస్ రెడ్డి . బిజెపి సీనియర్ నాయకులు రుద్ర శ్రీనివాస్ ,తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button