రాయికల్
కరాటేలో రాయికల్ మండల విద్యార్థుల ప్రతిభ
viswatelangana.com
March 4th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
మంచిర్యాల జిల్లా మందమర్రిలో అల్ స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ 7వ నేషనల్ లెవల్ కరాటే అండ్ కుంగ్ ఫు ఓపెన్ చాంపియన్ షిప్ పోటీలు కియో జపాన్ సోటోకన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగాయి. ఇందులో రాయికల్ పట్టణానికి చెందిన కరాటే మాస్టర్ కనుక ప్రభాకర్, ప్రవీణ్ వద్ద శిక్షణ పొందిన 12 మంది విద్యార్థులు స్పారింగ్, కటాస్ అంశాలలో బంగారు, వెండి పతాకలు సాదించగా వీరికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రశంసాపత్రాలు, పతకాలు అందజేశారు. పతాకలు సాదించిన సుశాంత్, శశాంక్, హంసిత్, దీక్షిత్, కండ్లపల్లి శశాంక్, యశ్వంత్, కే.సాత్విక్, ప్రహర్షిత, శాన్వి, సాహితీ, వి. సాత్విక్, శ్రీకృతి, నేహలను పలువురు అభినందించారు.



