డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అవమానించిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలి

viswatelangana.com
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం నాగునూరు గ్రామంలో మూడు రోజుల క్రితం రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన నిందితుల పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసి, అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం కోరుట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండలు వేసి అవమానించిన నిందితులను ఇంతవరకు అరెస్టు చేయకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా నిందితులను గుర్తించి వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తే ఇలాంటి సంఘటనలు జరగవని అన్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘ రాష్ట్ర నాయకులు బలిజ రాజారెడ్డి, ఉయ్యాల నరసయ్య, డివిజన్ అధ్యక్షుడు ఉయ్యాల శోభన్, బద్ది మురళి, భూపెల్లి నగేష్, సిరికొండ రాములు, పొట్ట లక్ష్మణ్, బలిజ సంతోష్ కుమార్, సామల వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.



