వెల్గటూర్

ఎమ్మార్పీఎస్ మారేడుపల్లి గ్రామ నూతన కమిటీ నియామకం

viswatelangana.com

January 17th, 2025
వెల్గటూర్ (విశ్వతెలంగాణ) :

ఎమ్మార్పిఎస్ జిల్లా కమిటీ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో నిర్వహించే వెయ్యి గొంతులు,లక్ష డప్పులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే సంకల్పం తో ఎస్సీ ఎబిసిడి వర్గీకరణ సాధనే లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గ్రామ గ్రామాన ఎమ్మార్పీఎస్ బలోపేతమే లక్ష్యంగా గ్రామాల వారిగా నూతన కమిటీలను నియమిస్తున్నాం అందులో భాగంగానే గురువారం ఎండపల్లి మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు చెన్న కుమారస్వామి ఆధ్వర్యంలో మారేడుపల్లి గ్రామ కమిటీ వేయడం జరిగింది. మారేడుపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు చిలుముల మోoడయ్య ఉపాధ్యక్షులుగా దాగెటి ఎల్లయ్య ప్రధాన కార్యదర్శి చిలుముల క్రిష్ణ అధికార ప్రతినిధి చిలుముల చిన్న అంజయ్య ప్రచార కార్యదర్శి గద్దల దుర్గయ్య కోశాధికారి చిలుముల పెద్ద అంజయ్య గౌరవ అధ్యక్షులుగా చిలుముల రాయమల్లు కార్యవర్గ సభ్యులుగా లచ్చయ్య, లక్ష్మణ్, బాణయ్య లచ్చయ్య, లింగయ్య ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పిఎస్ కొండాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు సుంకే తిరుపతి, సోషల్ మీడియా కన్వీనర్ బచ్చల వినయ్, లింగంపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button