రాయికల్

అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం

viswatelangana.com

March 9th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మూటపెల్లి అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ సారంగాపూర్ మండలం నాగునూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పులదండ వేసిన దుండగులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని, అలాగే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ అధ్యక్షులు అలుపట్ల లక్ష్మణ్, తాజా మాజీ సర్పంచ్ బెక్కం తిరుపతి, సభ్యులు బోడ నాగరాజు, చిన్న, నర్సయ్య, శేఖర్, రమేష్, శ్రీకాంత్, వినీత్, రాజకుమార్ మరియు అంబేద్కర్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button