రాయికల్
అంజన శ్రీ కి చేయూత

viswatelangana.com
June 11th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేట్ గ్రామానికి చెందిన బొమ్మకంటి నాగరాజు – గౌతమిల కూతురు కళాకారిణి దివ్యాంగురాలైన అంజన శ్రీకి, రామాజీపేట గ్రామంలో బొమ్మ కంటి నాగరాజు తో పాటు పదో తరగతి చదివిన 2003-04 బ్యాచ్ స్నేహితులు 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ తన కూతురి పరిస్థితి తెలుసుకున్న తన స్నేహితులు ఆర్థిక సహాయం అందించడం ఆనందాన్ని కలిగించిందని, మరి కొంతమంది దాతలు ముందుకు వచ్చి తన కూతురుకు ఆర్థిక సహాయం చేయాలని అన్నారు.



