రాయికల్

గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

viswatelangana.com

September 25th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని మైతాపూర్ గ్రామంలో 25 లక్షల ఎంపీ నిధులతో అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డి52 కెనాల్ కు తొంబర్రావుపేట వద్ద తూము ఏర్పాటు చేయగా 14 గ్రామాలకు సాగునీటి కొరత తీరడంతో సంతృప్తి చెందడం జరిగిందన్నారు. రాయికల్ మండలంలో 7 చెక్ డ్యాం లు ఏర్పాటు చేయడంతో జలకళ తో పాటు భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు. మైతాపూర్ గ్రామానికి పల్లె దవాఖానా కూడా మంజూరు చేయటం జరిగిందని అన్నారు. నిండు వేసవిలో సైతం రాయికల్ పెద్ద చెరువులో పడవ లో తిరిగిన సందర్భంగా డి52 తూం ద్వారా సాధ్యం అయిందని గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ త్వరితగతిన చొరవ తీసుకోవడం అభినందనీయ మన్నారు. రాయికల్ పట్టణానికి గ్రంథాలయం మంజూరుకు చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. వ్యవసాయ మార్కెట్ పనులు కొంత ఆలస్యమౌతుందని, త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్,ఫ్యాక్స్ ఛైర్మెన్ ఏనుగు మల్లారెడ్డి, మాజీ ఏఎంసి ఛైర్మెన్ గన్నె రాజ రెడ్డి, నాయకులు కోల శ్రీనివాస్, రవీందర్ రావు, పడిగెల రవీందర్ రెడ్డి, ఈఈ రహమాన్, తహాశీల్దార్ అబ్ధుల్ ఖయ్యాం, ఎంపిడివో బింగి చిరంజీవి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button