రాయికల్
ఎన్నికల కోడ్ ముగిసినా……… మహనీయులపై తొలగని ముసుగు

viswatelangana.com
March 7th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ఎత్తివేసింది. కానీ జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఎన్నికల కోడ్ నియమావళి వల్ల వేసిన ముసుగును సంబంధిత అధికారులు తొలగించడంలో విఫలమయ్యారు. అధికారులు స్పందించి పటేల్ విగ్రహానికి వేసిన ముసుగును తొలగించాలని, ప్రజాస్వామ్య దేశంలో మహనీయులపై ఉన్న విలువలు కాపాడాలని పట్టణ ప్రజలు, స్థానికులు కోరుతున్నారు.



