కోరుట్ల
సర్జికల్ షాప్ ప్రారంభించిన జువ్వాడి నర్సింగరావు, మానాల మోహన్ రెడ్డి

viswatelangana.com
June 14th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణ జాన్సీ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రాజరాజేశ్వరి మెడికల్ అలాగే సర్జికల్ షాప్ ను కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు తెలంగాణ కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు. ఈసందర్భంగా నిర్వాహకులు జువ్వాడి నర్సింగరావు, మానాల మోహన్ రెడ్డి లను శాలువాతో సన్మానించారు. ఈకార్యక్రమంలో వారితో పాటు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.



