కోరుట్ల
ఎస్సై శ్వేత సస్పెండ్

viswatelangana.com
October 5th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఎస్సై- 2 గా విధులు నిర్వహిస్తున్న శ్వేతను మల్టీ జోన్ ఐజి చంద్రశేఖర్ శుక్రవారం రాత్రి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. కొన్ని రోజుల క్రితం జగిత్యాల పట్టణానికి చెందిన శివకుమార్ ను భార్యాభర్తల విషయమై ఆయనపై చేయి చేసుకోగా మనస్థాపానికి గురైన శివకుమార్ ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. హైదరాబాదులో చికిత్స పొందుతూ మృతి చెందగా దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి నివేదిక ఆధారంగా ఎస్సై శ్వేతను సన్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.



