రాయికల్
బాసర అభిషేకం లడ్డు ప్రసాదం అందజేత…

viswatelangana.com
March 11th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా విద్యాశాఖాధికారి కె.రాము నాయక్ కు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ రాష్ట్ర శాఖ సహాధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి చంద సత్యనారాయణ లు బాసర శ్రీ సరస్వతీ అమ్మవారి అభిషేకం, లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ రోజు ఫాల్గుణ మాసం శుక్ల పక్షం నరసింహ ద్వాదశి రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు అవతరించిన రోజు సందర్భంగా శ్రీ నరసింహ స్వామి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి లో ఆధ్యాత్మికతకు అత్యంత ప్రాధాన్యత ఉందని, ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత, ఆత్మ బలం లభిస్తుందని అన్నారు.



