కథలాపూర్

ఊట్ పల్లి గ్రామంలో ఉచిత వాలీబాల్ వేసవి శిక్షణా శిబిరం

viswatelangana.com

May 8th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఉచిత వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం స్థానిక ప్రాథమికోన్నత పాఠశాల లో వాలీబాల్ క్రీడాకారుడు ముదాం ప్రవీణ్ ఆధ్వర్యంలో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు మాట్లాడుతూ విద్యార్థులు వేసవిలో చెడు తిరుగులకు అలవాటు పడకుండా, క్రీడల ద్వారా శారీరక మానసిక దృఢత్వం పొందుతారని అన్నారు. ఇట్టి శిక్షణ నెల రోజులు నిర్వహిస్తారని తెలిపారు . శిక్షణలో నాలుగవ తరగతి నుండి డిగ్రీ చదివే విద్యార్థులు పాల్గొనవచ్చని తెలిపారు. యువత ఈ సమ్మర్ క్యాంపు లను వినియోగించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ఈ వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరారు.సాయంత్రం క్రీడాకారులకు అరటి పండ్లు అందజేయడం జరిగింది.ఈ నెలరోజుల శిక్షణ శిబిరాన్ని క్రీడాకారులు వినియోగించుకొని జిల్లాస్థాయి రాష్ట్రస్థాయి జాతీయస్థాయిలో రాణించాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది. సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు ఏ జీబీ మహేందర్,రాచర్ల రవి చెన్నవేని శ్రీనివాస్ సతీష్, నవీన్, ప్రశాంత్, అజయ్ రాతేష్ వినయ్ తదితరులు పాల్గొనడం జరిగింది

Related Articles

Back to top button