రాయికల్
విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా చందనగిరి రమేష్

viswatelangana.com
January 29th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల విశ్వబ్రాహ్మణ సంఘము అధ్యక్షులుగా చందనగిరి రమేష్, వైస్ ప్రెసిడెంట్ గాలిపెల్లి స్వామి, ప్రధాన కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్,కోశాధికారి ఎదురు గట్ల రవీందర్, గౌరవసలహాదారులు కొడిమ్యాల లింగమూర్తి, మండలోజి శ్రీనివాస్, కొడిమ్యాల శంకరయ్య,చందనగిరి మనోహర్, కొడుమ్యాల శంకర్, శ్రీపాద లక్ష్మీనారాయణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యుల కోసం నా వంతు కృషి చేస్తానని, ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి ఉండాలని, నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు, యువకులు, సీనియర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



