కోరుట్ల

జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో వార్షికోత్సవ వేడుకల సంబరాలు

viswatelangana.com

March 18th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

పిఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికల పాఠశాల కల్లూరు రోడ్, కోరుట్లలో వార్షికోత్సవ వేడుకల సంబరాలు ఘనంగా జరిగాయి. పోటీ ప్రపంచంలో విద్యార్థులను ఆకర్శించడానికి పాఠశాల బృందం చేస్తున్న కృషిని అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ అంజమ్మ ప్రశంసించారు. జిల్లా విద్యాధికారి కే. రాము పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమాల చిత్రమాలిక ఆవిష్కరించారు. అలాగే పదవ తరగతి విద్యార్థులతో ఛాయాచిత్రం దిగి, 100శాతం ఫలితాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కమీషనర్ రామకృష్ణ, మండల విద్యాధికారి గంగుల నరేషం ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని అభినందించారు. విద్యా సంవత్సరంలో ప్రతీ దినం నూతనంగా నిర్వహించడం, ప్రతీ పోటీని ఛాలెంజ్ గా తీసుకోవడం క్రమశిక్షణతో విద్యార్థులు మెలగడం వల్ల ఉపాధ్యాయు సిబ్బంది కృషి మూలంగా వార్షికోత్సవం విజయవంతంగా చేసుకో గలిగామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి హెచ్ కృష్ణ మోహన్ రావ్ తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు, తల్లి తండ్రులు, విలేకరులు, స్కూల్ కంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button