రాయికల్

విద్యార్థులను అభినందించిన ఎంఈఓ రాఘవులు

viswatelangana.com

May 1st, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

బుధవారం ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాలలో జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని వివేకవర్ధిని విద్యాలయంలో చదివి 576 మార్కులు సాధించిన గాజంగి హరిణ శ్రీ, 565 మార్కులు సాధించిన జన్నారపు వర్షాలను ఎంఈఓ శ్రీపతి రాఘవులు అభినందించారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, శ్రద్దగా చదివి అత్యధిక మార్కులు సాధించడం చాల గర్వకారణం అని, ఇందుకు తోడ్పడిన తల్లిదండ్రులుపట్ల, విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో కూడా అత్యధిక మార్కులు సాధిస్తూ తమ తల్లిదండ్రుల పేరును ఉన్నత స్థానంలో ఉంచుతామని విద్యార్థులు అన్నారు. తమ విద్యార్థులు ఎస్ఎస్సి లో 100% ఉత్తీర్ణతతో పాటు 500 మార్కులకు పైగా 46 మంది విద్యార్థులు మరియు అత్యధిక మార్కులు సాధించడం పట్ల వివేకవర్ధిని విద్యాలయం ప్రధానోపాధ్యాయులు కైరం సత్యం సంతృప్తి వ్యక్తం చేశారు. చక్కటి విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులను అభినందించారు.

Related Articles

Back to top button