రాయికల్
కళ్యాణ మండపానికి భూమి పూజ

viswatelangana.com
March 9th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేట గ్రామంలో శ్రీ సీతారామచద్రాలయం ఆవరణలో దైవ కార్యక్రమాల కోసం,భక్తుల,గ్రామప్రజల అవసరార్థం రామాలయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల ఆశీర్వచనంతో ఆంజనేయ స్వామి సంకల్పబలంతో, భక్తుల, దాతల సహాయ సహకారాలతో కమిటీ సభ్యులు, గ్రామ ప్రజల సమక్షంలో కళ్యాణ మండపం కొరకు ఆదివారం ఉదయం సుముహూర్తం సమయంలో ఆలయ అర్చకులు చెరుకు మధు శర్మ మంత్రోచ్ఛరణాల మధ్య భూమి పూజ చేయడం జరిగింది. ఇట్టి పూజ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కోల రాజు, ప్రధాన కార్యదర్శి సల్ల రాజేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బోయిన నరేందర్ ,కోశాధికారి ఐలేని గంగారెడ్డి కార్యవర్గ సభ్యులు రమాపతి రావు కమిటీ సలహాదారులు మోహన్, మోహన్ రెడ్డి,రాజేశ్వర్ రావు,గ్రామపెద్దలు భీమారెడ్డి, గుర్రు మల్లారెడ్డి, యూత్ సభ్యులు భగత్ పటేల్, కమలాకర్, రవికిరణ్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



