కోరుట్లజగిత్యాల

కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలి

జిల్లా కలెక్టర్ ను కోరిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుజువ్వాడి కృష్ణారావు

viswatelangana.com

July 25th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల (విశ్వతెలంగాణ) :

కాంగ్రెస్ పార్టీ జిల్లా (డి సి సి )కార్యాలయ నిర్మాణం కోసం జిల్లా కేంద్రమైన జగిత్యాల లో స్థలం కేటాయించాల్సిందిగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జువ్వాడి కృష్ణారావు జగిత్యాల జిల్లా కలెక్టర్ ను కోరారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ గా నూతనంగా వచ్చిన సత్యప్రసాద్ ను కలిసి పుష్పగుచ్చం అందించి అభినందించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. దీంతో పాటు కోరుట్ల నియోజకవర్గంలో గత పది సంవత్సరాలుగా అపరిస్కృతంగా ఉండి పేరుకుపోయిన సమస్యల గురించి వాటి పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ తో విపులంగా చర్చించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం స్థలాన్ని కేటాయించాల్సిందిగా అప్పటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా ఆ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం స్థలం కేటాయించిందని, కానీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించలేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థలం కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి, కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకుడు ఏలేటి మహిపాల్ రెడ్డి, సిరిపురం సత్తయ్య, తదితరులు ఉన్నారు.

Related Articles

Back to top button