కోరుట్ల
ఆలయ అభివృద్ధికి విరాళాలు

viswatelangana.com
March 3rd, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులకు ఐలాపూర్ గ్రామానికి చెందిన బొల్లెపల్లి. రాజలింగం గౌడ్ అనే వ్యక్తి తన ఉదార స్వభావంతో ఆలయం అభివృద్ధి కొరకు 75 వేల రూపాయలను విరాళంగా అందజేశారు. అలాగే మంచిర్యాలకు చెందిన శంకర్ అనే వ్యక్తి పదివేల రూపాయలను విరళంగా అందజేశారని ఆలయ కమిటీ సభ్యులు, చైర్మన్ తెలియజేశారు.



