రాయికల్

విశ్వశాంతి పాఠశాలలో హిందీ దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది

viswatelangana.com

September 14th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని విశ్వశాంతి పాఠశాలలో హిందీ దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది పిల్లలందరూ అఆ ఆకృతిలో కూర్చొని చూపరులను ఆలరించారు పాఠశాల ప్రిన్సిపాల్ మచ్చ గంగాధర్ మాట్లాడుతూ మన జాతీయ భాష గా పేరుగాంచిన “హిందీ” భాషకు సెప్టెంబర్ 14న ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14ను “హిందీ దివస్” గా జరుపుకుంటారు. ఇందుకు గల కారణం 1949వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన హిందీ భాషను అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది అప్పటి నుండి ఈ తేదీను హిందీ దివస్‌గా జరుపుకోవడం ఆనవాయితీ ప్రపంచంలోని చాలా దేశాలలో హిందీ భాషను మాట్లాడుతారు. మారిషస్, ట్రినిడాడ్, అమెరికా, దక్షిణాఫ్రికా, న్యూజిల్యాండ్ వంటి చాలా దేశాలలో ఇప్పటికీ హిందీ ముఖ్య భాషగా ఉంది అయితే మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ప్రపంచంలోనే ఎక్కువగా మాట్లాడే భాషలలో హిందీ భాష రెండవది కావడం ఇది మనం అందరం గర్వించదగిన విషయం మన జాతిపిత మహాత్మా గాంధీ కూడా దేశంలో ఐక్యతను తీసుకురావడానికి ఈ భాషనే వాడేవారు ఈ భాషను “లాంగ్వేజ్ ఆఫ్ యూనిటి” అనేవారు అంత గొప్పది మన హిందీ భాష, అందుకే అన్నారు మేరా భారత్ మహాన్ అని కాబట్టి హిందీ నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భాష సమస్య లేకుండా జీవించవచ్చు అని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మచ్చ లలిత, విద్యాన్వేష్ మరియు ఉపాధ్యాయులు మహేష్, శారు, స్రవంతి, మనీషా, సంజన, శృతి, మమత తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button