కోరుట్ల

ప్రపంచ పర్యాటక దినోత్సవం

viswatelangana.com

September 28th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘యువ టూరిజం క్లబ్’ కళాశాల కో-ఆర్డినేటర్ హుమైరా సుల్తానా ఆధ్వర్యంలో విద్యార్థులకు టూరిజం పై ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.ముత్యం రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి యువ టూరిజం క్లబ్ ఆవశ్యకత గురించి తెలుపుతూ విద్యార్థులను యువ టూరిజం క్లబ్ నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఎన్. సందీప్, డాక్టర్ డి. సుఖప్రదాదేవి, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రోత్సహిస్తూ టూరిజంపై ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించి టూరిజం పై విద్యార్థులకు అనేక సందేహాలను క్లుప్తంగా వివరించారు. అనంతరం వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేశామన్నారు.

Related Articles

Back to top button