కోరుట్ల

ఉద్యమానికి ఊపిరి పోసింది జగిత్యాల జర్నలిస్టులే

విలేఖరులను చిన్న చూపు చూడడం తగదు.

viswatelangana.com

August 9th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో గత ఏడు రోజులుగా కొనసాగుతున్న జర్నలిస్టుల నిరసన దీక్షకు శుక్రవారం కోరుట్ల మైనార్టీ రిపోర్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు హాజరై దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఈ మైనారిటీ రిపోర్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అన్వర్ సిద్ధికి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో చల్ల బడిన ఉద్యమానికి ఊపిరి పోసింది జగిత్యాల జీల్లా జర్నలిస్టులేనని పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఉద్యమ కాలంలో పనిచేసిన జర్నలిస్టులను కూడా గుర్తించక పోవడం బాధాకరం అన్నారు. వెంటనే స్థానిక ఎమ్మెల్సీలు టి.జీవన్ రెడ్డి, ఎల్.రమణ, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్, పాలక వర్గం నిర్ణయించుకొని జగిత్యాల జర్నలిస్టులకు అందరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇండ్ల నిర్మాణం కూడా ప్రభుత్వం ద్వారా చేపట్టి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జర్నలిస్ట్ సంఘాలన్నీ ఏకమై ఉద్యమాలను మరింత ఉదృతం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇండ్ల స్థలాలు – ఇండ్లు ఇచ్చేది ఈ నాయకుల బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. మైనార్టీ రిపోర్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అన్వర్ సిద్ధికి మాట్లాడుతూ. జర్నలిస్టుల దీక్షకు మేము మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఇకముందు చేసే ఉద్యమాలలో కూడా బాధ్యతగా పాల్గొంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మీర్జా ముక్రం బైగ్, ఎండీ ముజహిద్, ఎం ఏ జమీల్, ఎండీ రఫీ, ఎండీ మసీద్దీన్, మొమ్మద్ హుసైన్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button