కోరుట్ల

కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం నేటి యువతకు ఆదర్శం…

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు

viswatelangana.com

September 27th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

తెలంగాణ పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం నేటి తరాలకు ఆదర్శం ప్రాయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపుజీ 109వ జయంతి సందర్భంగా కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల, మెట్ పల్లి పట్టణాలతో పాటు మల్లాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆచార్య లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జువ్వాడి కృష్ణారావు, అనంతరం మాట్లాడుతూ తెలంగాణ కోసం తన సొంత హాస్టల్ త్యాగం చేసి 97 సంవత్సరాల వయసులో ఢిల్లీలో తెలంగాణ కోసం పోరాటం చేసిన మహాయోధుడు బాపూజీ అని కొనియాడారు. ఈకార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావుతో పాటు కోరుట్ల పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య అనిల్, కోరుట్ల, మెట్ పల్లి, మల్లాపూర్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కోరుట్ల మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, జెట్టి లింగం, జిల్లా కిసాన్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, అల్లూరి మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అంతడుపుల నర్సయ్య, జమాల్, నల్ల రాజన్న, మల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, కోరుట్ల మున్సిపల్ కౌన్సిలర్ ఎంబెరి నాగభూషణం, సత్యనారాయణ, ఆడేపు మధు, చింత రూపలత అశోక్, కోరుట్ల పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మచ్చ కవిత, కస్తూరి రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం వేణు, మర్రి సహదేవ్, షేక్ మహమ్మద్, చేదలు సత్యనారాయణ, పేట భాస్కర్, నేమురి భూమయ్య, రాజోజి సదానంద చారి, గుంటుక ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button