కొడిమ్యాల మండల జిల్లా అదనపు డిఆర్దిఓ ప్రత్యేక అధికారి చరణ్ దాస్

viswatelangana.com
కొడిమ్యాల మండల కేంద్రంలోని స్థానిక సెర్ప్ కార్యాలయంలో కొడిమ్యాల మరియు, మల్యాల మండలాలకు చెందిన పిఎం ఎఫ్ఎంఈ లబ్ధిదారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది.ఇట్టి శిక్షణ కార్యక్రమానికి జిల్లా అదనపు డిఆర్డిఓ, కొడిమ్యాల మండలం ప్రత్యేక అధికారి చరణ్ దాస్, హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా వారు లబ్ధిదారులతో మాట్లాడుతూ పిఎం ఎఫ్ఎంఇ (ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థ) ద్వారా యూనిట్ మంజూరైన లబ్ధిదారులు కేటాయించిన ఆక్టివిటీని పూర్తిస్థాయిలో ఉపయోగించుకొని వ్యాపారంలో అభివృద్ధి చెందాలని అన్నారు. మార్కెటింగ్ సదుపాయాలు. ప్యాకింగ్. ఇతర లాభాల గురించి లబ్ధిదారులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిపిఎం వెంకటేశం సార్. శ్రీనిధి రీజినల్ మేనేజర్ రామ్ నారాయణ సార్. జిల్లా ఏపీఎం హుస్సేన్ సార్ .జిల్లా ట్రైనర్ రామకృష్ణ.మండల ఇన్చార్జి ఎపిఎం పద్మ. సీసీలు వీర కుమార్. స్వరూప.మంగ.శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ గీతాంజలి. మండల సమాఖ్య అధ్యక్షురాలు పద్మ. అకౌంటెంట్ సుకన్య . ఆపరేటర్ మాధవి మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.



