రాయికల్
కన్నుల పండుగగా ఆరట్టు ఉత్సవం..

viswatelangana.com
December 6th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో అయ్యప్ప ఆరట్టు ఉత్సవాన్ని శుక్రవారం కన్నుల పండుగగా నిర్వహించారు. అయ్యప్ప ఆలయం నుంచి పురవీధుల గుండా ఉత్సవ మూర్తిని వైభవంగా ఊరేగింపు తీసుకువచ్చి పెద్ద చెరువులో అభిషేకం, చక్రస్నానం నిర్వహించారు. శోభ యాత్రలో ఒగ్గుడోలు నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో అర్చకులు, అయ్యప్ప స్వాములు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.



