కోరుట్ల
బెట్టింగ్ యాప్స్ ని నిషేధించాలి

viswatelangana.com
March 22nd, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
పెండెం గణేష్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మాట్లాడుతూ బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రతిరోజు పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని,ఇప్పటివరకు దేశంలో కొన్ని లక్షల్లో కేవలం బెట్టింగ్ కారణంగానే ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇల్లీగల్ బెట్టింగ్ సైట్లు ప్రమోట్ చేసిన ప్రకాష్ రాజ్ లాంటి సినీ ప్రముఖులు మరియు ఇతర వ్యక్తులను చట్టపరంగా శిక్షించాలని బెట్టింగ్స్ కారణంగా చాలామంది యువత నాశనం అయిపోతున్నారని అని అన్నారు .. ఒకానొక సమయంలో ఆత్మహత్యలు కూడా చేసుకునే సందర్భాలకు దిగజారిపోయారని ఎన్నో కాబట్టి బెట్టింగ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయవద్దు.. బెట్టింగ్ ప్రకటనలకు కూడా చాలా దూరంగా యువత ఉండాలని,పోలీస్ అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని అని కోరడం జరిగింది..



