మెట్ పల్లి

మనోహర గార్డెన్స్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మెట్ పల్లి ఫ్రెషర్స్ డే వేడుకలు

viswatelangana.com

September 25th, 2024
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :

ప్రభుత్వ జూనియర్ కళాశాల మెట్ పల్లి లో కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన “ఫ్రెషర్స్ డే ” కార్యక్రమం మనోహర గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగిత్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డాక్టర్ కే.వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులందరూ ప్రతిరోజు కళాశాలకు వచ్చి క్రమశిక్షణగా ఉంటూ విజ్ఞానాన్ని పెంపొందించుకొని రానున్న పబ్లిక్ పరీక్షలలో ఉత్తమమైన మార్కులు సాధించి కళాశాలకు తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని కోరారు.విద్యార్థుల డాన్స్,నాటికలను తిలకించి సంతృప్తిని వ్యక్తం చేశారు.అనంతరము ఈ కళాశాలలో పనిచేసి బదిలీపై వెళ్లిన వారిని, కళాశాలలో ఉత్తమమైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చదువుతో పాటు ప్రతి విద్యార్థిలో ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుందని వాటిని వెలికితీయడానికి కాలేజీలు చక్కని వేదికలని వీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అనంతరంవిద్యార్థులు ఆనందోత్సవాల మధ్య డాన్సులు, నాటికలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సిహెచ్ శ్రీనివాస్, జగపతి,శ్రీనివాస్, మహేశ్వరి,నర్సయ్య , సుదర్శన్,ప్రతిభ, స్వర్ణలత, మంజుల, కిరణ్ కుమార్, జాకీర్, నవీన్ కుమార్, జమున, పత్రిక విలేకరులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button