రాయికల్
చాకలి ఐలమ్మ 129 వ జయంతి

viswatelangana.com
September 26th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో గురు వారము రోజున చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని రగిల్చిన అగ్నికణం ఐలమ్మ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సామాల్ల వేణు, కాటిపల్లి గంగారెడ్డి, ఆదిరెడ్డి, కొల్లూరు వేణు, అనుపురం చిన్న లింబాద్రిగౌడ్, రొట్టె శ్రీధర్, మరిపల్లి శ్రీనివాస్ గౌడ్, కోడిపెల్లి స్వామి రెడ్డి, కుంట గంగారెడ్డి, వేల్పుల లక్ష్మణ్, ముత్తన్న, లక్ష్మయ్య, కొక్కు శేఖర్, కనపర్తి శ్రీనివాస్, రజక సంఘం అధ్యక్షులు మాదాసు గంగరాజు ఓరగంటి రాజేష్ మరియు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



