కథలాపూర్

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన కథలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ

viswatelangana.com

June 2nd, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా కథలాపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి, తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్స్ పంపిణిచేసి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకొని వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది, ఇట్టి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాయతి నాగరాజ్, జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి అజీమ్ లు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలుపుతూ నాలుగు కోట్ల ప్రజల కలను నెరవేర్చుతూ తెలంగాణను అందించినటువంటి సోనియా కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.. ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పుండ్రనారాయణరెడ్డి, వైస్ చైర్మన్ పులి శిరీష హరి ప్రసాద్, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు వ్యగరపు శ్రీహరి,రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి కల్లెడ గంగాధర్, మండల్ కార్యవర్గ సభ్యులు జవాజి రవి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు పంబల శంకర్, బీసీ సెల్ అధ్యక్షుడు లింగ గౌడ్, సీనియర్ నాయకుడు వెలిచాల సత్యనారాయణ, మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంబటి రాధాకృష్ణ, మండల సోషల్ మీడియా కన్వీనర్ కూన అశోక్, వాకిటి రాజారెడ్డి, భూపెల్లి సాయబు, తలారి మోహన్,అంగ మహేష్, ఆకుల సత్యనారాయణ, ఎండీ మొయినుద్దీన్ తిరుపతి, రంజిత్, అరుణ్, అంజా గౌడ్, మండల మరియు గ్రామస్థాయి వివిధ హోదాల, పలు శాకాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

Back to top button