కోరుట్ల పట్టణంలో నూతన ఎమ్మార్వోకు ఘన సన్మానం

viswatelangana.com
కోరుట్ల పట్టణానికి తాజాగా ఎమ్మార్వోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ కృష్ణ చైతన్య కి స్థానిక రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఘన సన్మానం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ, “ప్రజల సమస్యలను సమగ్రంగా అర్థం చేసుకొని, వాటి పరిష్కారానికి న్యాయమైన నిర్ణయాలు తీసుకోవడమే నా ప్రథమ కర్తవ్యం. వృద్ధులు, సామాన్యులు, మరియు బలహీన వర్గాలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తాను” అని చెప్పారు.సన్మాన కార్యక్రమంలో యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమాజ్వాదీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్, జమాతే ఇస్లామీ హింద్ కోరుట్ల అధ్యక్షులు ఇలియాస్ అహ్మద్ ఖాన్, ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్,రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఎలిశేట్టి గంగారెడ్డి, టౌన్ అధ్యక్షులు శనగారపు రాజేష్, అబ్దుల్ బారి, అబ్దుల్ ఖయ్యూం, అదానాన్ షకీల్ ఇతర సంఘాల ప్రతినిధులు పాల్గొని నూతన ఎమ్మార్వోకు శుభాకాంక్షలు తెలిపారు.



