కోరుట్ల
కోరుట్ల పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యునికి సన్మానం

viswatelangana.com
September 4th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం ఎన్నికలు జరుగగా, ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఎక్కల్ దేవి రాంచంద్రంను వారి వంశీయులు ఘనంగా సన్మానం చేసారు. ఈ సందర్భంగా రామచంద్రం మాట్లాడుతూ… కుల సంఘం ఎన్నికలలో నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన పద్మశాలి కుల సభ్యులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుండి పద్మశాలి సంఘం అలాగే దేవాలయ కమిటీ అభివృద్ధికి నా సాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.



