కథలాపూర్
బండి సంజయ్ పిలుపు మేరకు వడ్ల కల్లాలను పరిశీలించిన బిజెపి నాయకులు

viswatelangana.com
May 18th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని వివిధ గ్రామాలైన అంబారిపేట, తక్కలపల్లి, తాండ్రియాల, దూలూరు, బొమ్మెన, గంభీర్ పూర్, పోతారం, పోసానిపేట్, ఊట్ పల్లి, కథలాపూర్ గ్రామాలలోని వడ్ల కల్లాలని సందర్శించి అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ కథలాపూర్ శాఖ తరపున బిజెపి నాయకులు డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల బిజెపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



