కథలాపూర్
12 మంది పేకాట రాయుళ్లను పట్టుకున్న ఎస్సై

viswatelangana.com
June 7th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో శుక్రవారం సాయంత్రం సమయంలో సిరికొండగ్రామ శివారులో పత్తాలాట ఆడుతుండగా పన్నెండు మంది వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి రూపాయలు 76,360/- మరియు 10 బైకులు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేయనైనది అని కథలాపూర్ ఎస్సై జి నవీన్ కుమార్ తెలిపినారు.



